అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15వ తేదీన ఈ చిత్రం విడుదల కాగా ఈ సినిమా అక్కినేని అఖిల్ కు భారీ విజయాన్ని అందించి ఆయనలో మంచి ఆత్మ విశ్వాసాన్ని నింపింది అని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి మూడు సినిమాలు చేసినా కూడా ఒక్క విజయం కూడా అందుకోలేక ఇతర హీరో ల కంటే వెనుకబడి పోయాడు అఖిల్. దాంతో ఆయన తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోను అయ్యారు.
ఇక ఎన్నో ఆశలతో చేసిన నాలుగో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మొదటినుంచి వ్యక్తపరిచాడు అఖిల్. ఆ విధంగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచి అక్కినేని అఖిల్ కు తొలి విజయాన్ని కట్టబెట్టింది. ఈ సినిమా ఇంతా పెద్ద హిట్ అవడమే కాదు యూ ఎస్ లో భారీ వసూళ్లను సాధిస్తుంది. యూ ఎస్ మార్కెట్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం చిన్న సినిమా ల విషయం లో చాలా అరుదుగా చూస్తుంటాం.
వాస్తవానికి పెద్ద సినిమాలు మాత్రమే ఈ క్లబ్ లోకి చేరుతాయి. కరోనా తర్వాత వకీల్ సాబ్ లవ్ స్టోరీ చిత్రాలు మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకోగా యూఎస్ బాక్సాఫీసు వద్ద ఈ అక్కినేని కుర్రాడు ఈ రెండు సినిమాలకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు 4.5 లక్షల మిలియన్ డాలర్స్ ను అందుకున్న ఈ చిత్రం నెమ్మది నెమ్మదిగా మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి ఆ రికార్డు సాధించిన సినిమాల లిస్టులో చేరుతుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. మరి పెద్ద హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ రికార్డును అతి తక్కువ కాలంలోనే అక్కినేని అఖిల్ అందుకోవడం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గా మారిందని చెప్పవచ్చు. తెలుగునాట ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాస్తూ ఉండగా యూ ఎస్ మార్కెట్లో అక్కినేని అఖిల్ కు ఏ రేంజ్ లో స్వాగతం లభిస్తుందో చూడాలి.