సోషల్ మీడియాలో సెలబ్రెటీలు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..హాట్ ఫోటోలు డ్యాన్స్ వీడియోలు ఫన్నీ కబుర్లు ఇలా ఎన్నెన్నో చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంటారు. అయితే తాజాగా అలాంటి ప్రయత్నమే మంచు వారమ్మాయి మంచు లక్ష్మి కూడా చేసి నెట్టింట వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి ఎక్కడున్నా ఆ కిక్కే వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఏదైనా సినిమా ఫంక్షన్ వచ్చిందంటే మంచు లక్ష్మి ఏం మాట్లాడుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా వైరల్ అవ్వాల్సిందే. ముఖ్యంగా తన ఇంగ్లీష్ తో ఇండస్ట్రీలోనే ఇంగ్లీష్ టీచర్ అంటూ మంచు లక్ష్మి బిరుదు తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వీడియోలు చేస్తూ మంచు లక్ష్మి అభిమానులకు మరింత వినోదాన్ని పంచుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ మంచు లక్ష్మి ఎక్కువగా యాక్టివ్ గా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తన ఫోటోలతో పాటు ఇతర అంశాలపైనా సరదాగా మాట్లాడుతూ మంచు లక్ష్మి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక మంచు లక్ష్మి కూడా తన టాలెంట్ ను చూపించుకునేందకు ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు లక్ష్మి ఓ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంగ్లీష్ పాటకు స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.. అంతే కాకుండా ఆ పాటలో మంచు లక్ష్మి కలర్ కలర్ ల బట్టలు మారుస్తూ ఆకట్టుకుంది. ఇక ఈ వీడియోకు ఆసక్తికరంగా పిచ్చి ముదిరింది అంటూ పెట్టిన టైటిల్ మరో హైలెట్ అనే చెప్పారు. ఇక మంచు లక్ష్మి పిచ్చి ముదిరిన వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. అంతే కాకుండా ఈ వీడియోకి మంచు అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. బ్యూటీ రకుల్ కూడా మంచు లక్ష్మి వీడియోకు వో వో అంటూ కామెంట్ పెట్టింది.