పొగరు, ప్రేమ కలగలిపితే సిమ్రాన్

Vimalatha
నిన్నటి తరం హీరోయిన్లలో అందం, అభినయంతో పాటు పొగరు కూడా కాస్త ఎక్కువే అని చెప్పుకునే హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. అప్పట్లో తెర పై అందరు హీరోయిన్లు ఒక ఎత్తు అయితే సిమ్రాన్ మాత్రం మరోవైపు. ఆమె తెలుగుతో పాటు హిందీ మలయాళం తమిళ చిత్రాల్లో కూడా నటించి సినిమా ఇండస్ట్రీ లో తన మార్కు చాటుకుంది. సమరసింహా రెడ్డి, అన్నయ్య, కలిసుందాం రా, నువ్వొస్తావని, యువరాజు, మృగరాజు, ప్రేమతో రా, బావ నచ్చాడు, డాడీ, సీతయ్య, ఒక్కమగాడు వంటి చిత్రాల్లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడే కథా ప్రాధాన్యత ఉంటే తల్లిగా నటించడానికి కూడా సిద్ధమయ్యింది. అయితే డాడీ సినిమాలో ఇల్లాలిగా ఆమె కనబరిచిన నటన ఎప్పటికీ ప్రత్యేకమే. కేవలం ఇల్లాలిగా మాత్రమే కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లిగా కూడా కనిపించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది సిమ్రాన్. కుటుంబం కన్నా ఎక్కువగా ఫ్రెండ్స్ కు ప్రాధాన్యతను ఇచ్చే ఓ వ్యక్తి, అదే ఫ్రెండ్ ను నమ్మి మోసపోతాడు. అతని వాళ్ళ కూతురును పోగొట్టుకుంటారు ఆ దంపతులు. అప్పటి నుంచి కోపంతో భర్తకు దూరంగా ఉంటూ పాపను చూసుకునే భార్యగా, కలిసి ఉన్నప్పుడు అందమైన కుటుంబాన్ని చూసుకునే సతీమణిగా ఆమె అభినయానికి ఫిదా అవ్వాల్సిందే.
అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉండేవారు. అలాంటి వారికి సిమ్రాన్ మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఇక డాడీ తో పాటు ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో కనిపించిన సిమ్రాన్ ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలో మాత్రమే నటిస్తోంది. మరి మళ్ళీ సిమ్రాన్ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుందా ? లేక కోలీవుడ్ లోనే సెటిల్ అవుతుందా ? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: