ఆర్. నారాయణమూర్తి ఎన్టీఆర్ సినిమాని అందుకే వదులుకున్నాడట..?

murali krishna
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమాలో మూర్తి అనే కానిస్టేబుల్ పాత్ర అందరికి గుర్తుండే ఉంటుంది.


పోసాని కృష్ణమురళి చేసిన ఈ పాత్ర  హీరోను మార్చే క్యారెక్టర్లలో ఇది కూడా ఒకటని తెలుస్తుంది.. ఎన్టీఆర్ లంచగొండితనాన్ని మొహం మీదనే వ్యతిరేకించే కానిస్టేబుల్ మూర్తి పాత్ర ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచిందని తెలుస్తుంది.ముఖ్యంగా ఎన్టీఆర్ సెల్యూట్ చేయమని సీరియస్ అయినప్పుడు కూడా నా చేతిని అయినా నరుక్కుంటా కానీ మీకు మాత్రం సెల్యూట్ చేయనని పోసాని చెప్పే డైలాగ్ జనాలకు ఇప్పటికీ మర్చిపోలేరని తెలుస్తుంది.. అంతలా పాపులర్ అయిపోయింది ఆ పాత్ర. ఇంతటి ముఖ్యమైన రోల్‌కు దర్శకుడు పూరీ జగన్నాథ్ ముందుగా అనుకున్నది పోసానిని కాదనీ సమాచారం.పీపుల్స్ స్టార్ అయిన ఆర్‌. నారాయణమూర్తి కోసం కానిస్టేబుల్ పాత్రను రాసుకున్నాడట దర్శకుడు పూరీ జగన్నాథ్‌. అందుకే ఆ కానిస్టేబుల్ పాత్రకు మూర్తి అనే పేరును పెట్టాడనీ చెప్పాడు పూరీ. ఇదే విషయం ఆర్.నారాయణమూర్తికి చెప్పి సినిమాలో అవకాశం ఇస్తే ఆ పాత్ర చేయలేనని రిజెక్ట్ చేశాడట మన పీపుల్స్ స్టార్‌ ఆర్.నారాయణ మూర్తి. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒప్పించేందుకు ట్రై చేసినా కూడా ఆర్.నారాయణమూర్తి వినిపించుకోలేదనీ తెలుస్తుంది.. అయితే టెంపర్ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆర్‌.నారాయణమూర్తి చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.


టెంపర్ సినిమాలో ఆ పాత్ర ఆర్‌.నారాయణ మూర్తి చేస్తే సినిమా ఆడేస్తుందని పూరీ జగన్నాథ్ ఆ అవకాశం ఇవ్వలేదట. నాతో ఆయన ఒక డిఫరెంట్ పాత్ర  గొప్ప పాత్ర వేయించాలని అనుకున్నాడట.ఆ క్యారెక్టర్ నాకు ఉపయోగపడాలని ఆ నిర్ణయం తీసుకున్నాడనీ సమాచారం. అంత గొప్ప పాత్రను ఇవ్వాలని అనుకున్న పూరీ జగన్నాథ్‌కు నా సెల్యూట్ అని ఆయన చెప్పారట.ఈ సినిమాలో నటించమని జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రేమగా అడిగారనీ కానీ ఈ పాత్ర నేనుచేయలేను మన్నించండి అని సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించా అని చెప్పుకొచ్చాడట ఆర్. నారాయణమూర్తి. టెంపర్‌లో అవకాశం ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో కారణాన్ని కూడా వివరించాడనీ తెలుస్తుంది. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలాగే హీరోగా ఎదిగాను.ఇక చేస్తే ఐదారేండ్లకు మించి సినిమాలు చేయలేననీ ఇలాంటి సమయంలో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెనక్కి వెళ్లదలచుకోలేదని చెప్పాడట ఆర్‌.నారాయణమూర్తి. ఆ ఉద్దేశంతోనే టెంపర్ సినిమాలో ఆఫర్ వదులుకున్నా తప్ప  మరే కారణం లేదని వివరించాడనీ తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: