లేత భామలు ఓకే అంటే.. కుర్ర హీరోలు ఊహూ.. అంటున్నారు..!

NAGARJUNA NAKKA
మీడియం రేంజ్‌ మూవీస్‌కి అందుబాటులో ఉండే లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌ లాంటి హీరోయిన్లు సక్సెస్‌ రేస్‌లో వెనకబడిపోయారు. లావణ్యకి లా చాలా రోజులుగా సరైన హిట్‌లేదు. 'మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఇంటిలిజెంట్, ఎ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా' లాంటి ఫ్లాపులతో నిరాశలో ఉంది. అనుపమ పరమేశ్వరన్ బిగినింగ్‌లో మంచి హిట్స్ కొట్టింది. 'అఆ, ప్రేమమ్, శతమానం భవతి' లాంటి సినిమాలతో లక్కీమస్కట్‌లా కనిపించింది. కానీ ఆ తర్వాత 'కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్‌6 యు' ప్లాపులతో కొంచెం స్లో అయింది. ఈ లోపు మళయాళం సినిమాలతో తెలుగునాట కొంచెం గ్యాప్ వచ్చింది.
'హలో' సినిమాతో పలకరించిన కళ్యాణి ప్రియదర్శన్ 'రణరంగం' ఫ్లాప్ తర్వాత మళ్లీ కనిపించలేదు. అలాగే బెస్ట్ పెర్ఫామర్ అనిపించుకున్న నివేదా థామస్‌ 'జై లవకుశ' తర్వాత పై చదువుల కోసం సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ బ్రేక్ తర్వాత నివేదాకి మళ్లీ మునుపటి రేంజ్‌లో అవకాశాలు రావడం లేదు.  
రాశీ ఖన్నా బిగినింగ్‌లో బాగానే హడావిడి చేసింది. 'ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, తొలిప్రేమ' లాంటి సినిమాలతో జోరు చూపించింది. అయితే 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ తర్వాత రాశి తమిళ్‌కి వెళ్లిపోయింది. అక్కడ మల్టిపుల్‌ మూవీస్‌కి సైన్ చేసింది. దీంతో తెలుగు సినిమాలకి కొంచెం దూరమైంది రాశి. 'పెళ్లి చూపులు' సినిమాతో సూపర్‌ రెస్పాన్స్ తెచ్చుకుంది రీతూ వర్మ. అయితే ఈ మూవీ తర్వాత రీతుకి పెద్దగా హిట్స్‌ రాలేదు. 'కేశవ, టక్‌ జగదీష్' లాంటి ఫ్లాప్స్‌తో కొంచెం స్లో అయింది. ఇక 'ఇస్మార్ట్ శంకర్'తో సూపర్ రెస్పాన్స్‌ తెచ్చుకున్న నభా నటేశ్‌కి 'డిస్కోరాజా, అల్లుడు అదుర్స్'తో బ్రేకులు పడ్డాయి.
పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్లు మీడియం రేంజ్‌ హీరోస్‌తో సినిమాలు చేస్తున్నా రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటున్నారు. పూజ 3 కోట్లకి వరకు డిమాండ్ చేస్తోంటే, రష్మిక రెమ్యూనరేషన్ 2 కోట్లు దాటిందట. దీంతో చిన్న సినిమాలు వీళ్ల వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: