పవన్ డెసిషన్ తో షాక్ లో నిర్మాతలు!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే రాజకీయంగా కూడా కొంత బలంగా మారుతున్నాడు. అధికార ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపార్టీని ఆయన విమర్శలు చేస్తూ రోజురోజుకు అంచెలంచెలుగా ఎదిగి పోతున్నాడు రాజకీయ నేతగా. మరోవైపు ఆయన సినిమాలను వరుసగా ఒప్పుకుంటూ పోయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న నాలుగు సినిమాలలో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.  మరొక రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తుంది అని చెప్పవచ్చు. ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలకు ఈ నిర్ణయం చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయేమోనన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ పవన్ తీసుకున్న నిర్ణయం ఏంటి అని ఆసక్తి అందరిలో కలిగే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన తన మకాంను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చాలని డిసైడ్ అయ్యాడట.

అంటే అక్కడ ప్రజలకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండాలని ఆ ప్రాంతంలోనే ఉండాలనేది పవన్ ఆలోచన. అయితే ఇదే ఆయన నిర్మాతలను టెన్షన్ పెట్టిస్తుంది. ఆయన సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటాయి. అలాంటప్పుడు పవన్ విజయవాడలో ఉంటే రోజు విజయవాడకు వచ్చి పోవాల్సి ఉంటుంది.  అందుకోసం ఆయన ఓ ప్రైవేటు జెట్ లో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ ఖర్చులు కూడా పవన్ కళ్యాణ్ సినిమా ల ప్రొడ్యూసర్ పెట్టుకోవాల్సిందే కాబట్టి ఇది వారికి మరింత ఆర్థిక భారాన్ని పెంచే పని అవుతుందనేది వారి ఆలోచన.  అంతేకాదు ఎంత కాదన్నా ప్రైవేట్ జెట్ అయినా కూడా షూటింగ్ కి చాలా ఆలస్యం అవుతుంది.  దాంతో పవన్ కళ్యాణ్ తన సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అందరూ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: