విడాకులు ఇచ్చిన సమంతకు కొత్త చిక్కులు...!
దీంతో పాటు తెలుగు లోనే ఆమె ఏకంగా మూడు కొత్త సినిమాలకు సైన్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది. ఈ సినిమాకు కొత్త దర్శక ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నిర్మాత అయిన శ్రీదేవీ మూవీస్ అధినేత కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని టాక్ ? అయితే ఈ సినిమాలో సమంతదే మెయిన్ లీడ్ రోల్. అయితే ఈగ సినిమాలో లా ఓ హీరో పాత్ర కూడా ఉంటుందట.
అయితే హీరో పాత్ర ఈ సినిమాలో కథాను సారంగా చాలా నామమాత్రంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సమంత పక్కన నటించేందుకు పెద్ద హీరోలు ఎవ్వరూ ముందుకు రావడం లేదట. అయితే ఏ మీడియం రేంజ్ హీరో నో ఈ పాత్రకు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమె పక్కన ఓ చిన్న రోల్ చేసేందుకు ఎవ్వరు మాత్రం ముందుకు వస్తారన్నదే పెద్ద డౌట్ ? ఏదేమైనా సమంతకు ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తున్నా.. ఆమె పక్కన సరైన హీరోలు సెట్ అయ్యే పరిస్థితి లేదు.