మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్... అఖిల్ ఫ‌స్ట్ డే కుమ్మేశాడే...!

VUYYURU SUBHASH
రెండున్న‌రేళ్లుగా ఊరించి ఊరించి వ‌స్తోన్న అక్కినేని హీరో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ ఎట్ట‌కేల‌కు ద‌స‌రా కానుక‌గా నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మామూలుగా అఖిల్ సినిమాకు పెద్ద బ‌జ్ ఉండ‌డం లేదు. అఖిల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆరేళ్లు అయ్యింది. ఈ ఆరేళ్ల‌లో చేసిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్లే. పైగా భారీ బ‌డ్జెట్ తో వ‌చ్చిన అఖిల్ , హ‌లో సినిమా ల గురించి చెప్పు కోవ‌డానికి కూడా ఏం లేదు.
ఇక 2019లో వ‌చ్చిన మిస్ట‌ర్ మ‌జ్ను త‌ర్వాత రెండున్న రేళ్లు గ్యాప్ తీసుకుని మ‌రీ అఖిల్ ఈ సినిమా చేశాడు. గీతా కాంపౌండ్ లో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో పాటు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కావ‌డంతో కాస్త ఆశ‌లు ఉన్నాయి. ఇక మ‌రో వైపు ద‌స‌రా కానుక‌గా రావ‌డం.. ఇటు ఏపీలో కూడా 100 ఆక్యుపెన్సీ తో థియేట‌ర్లకు ప‌ర్మిష‌న్లు రావ‌డంతో ఈ సినిమా కు మంచి అప్లాజ్ వ‌చ్చింది.
ఇక సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. అయితే లెహ‌రాయి అన్న పాట వైర‌ల్ అవ్వ‌డం, అటు పూజా హెగ్డే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా ఉండ‌డం తో ఓపెనింగ్స్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సినిమా టాక్ ఎలా ?  ఉన్నా కూడా తొలి రోజు బ్యాచిల‌ర్‌కు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రు. 11 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. శ‌ని, ఆది వారాలు ఉండ‌డంతో ఫ‌స్ట్ వీకెండ్ మంచి వ‌సూళ్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.
మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ తొలి రోజు వసూళ్లు ఇలా వున్నాయి
నైజాం -1.76 కోట్లు
సీడెడ్ - 1.10 కోట్లు
సీడెడ్ - 1.10 కోట్లు
ఈస్ట్ - 30 ల‌క్ష‌లు
వెస్ట్ - 28 ల‌క్ష‌లు
కృష్ణా - 31 ల‌క్ష‌లు
వైజాగ్ - 56 ల‌క్ష‌లు
గుంటూరు - 50 ల‌క్ష‌లు
నెల్లూరు - 23 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ - 235k

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: