రాబోయే రోజుల్లో బ్యాచిలర్ పరిస్థితి ఏంటో .... ??

GVK Writings
ప్రస్తుతం అక్కినేని వారి మూడవతరం వారసుడు అఖిల్ నటించిన లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకత్వం వహించారు. మంచి క్లాస్ పంథాలో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని తీశారు.
ఇటీవల సంగీత దర్శకడు గోపి సుందర్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో విడుదలై అందరి నుండి మంచి స్పందన అందుకున్నాయి .అయితే మొత్తంగా ఎన్నో అంచనాలు మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఓవరాల్ గా యావరేజ్ టాక్ వినపడుతోంది. ముఖ్యంగా సినిమాని గతంలో తాను తీసిన బొమ్మరిల్లు పంథాలోనే నడిపిన దర్శకుడు భాస్కర్, చాలా వరకు సినిమాలో లాజిక్స్ మిస్సయ్యారని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అలానే సినిమా ఏ మాత్రం మాస్ ఆడియన్స్ కి ఎక్కదని, ఇక బి, సి వంటి సెంటర్స్ లో ఈ సినిమా ఎంతమేర కొనసాగుతుంది అనేది చెప్పడం కష్టం అని మరికొందరు అంటున్నారు. నిజానికి భాస్కర్ తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీయడంలో కొంత విఫలం అయ్యాడని అంటున్నారు.
ఎమోషనల్ సన్నివేశాలతో పాటు సినిమాలో అక్కడక్కడా కొంత ల్యాగ్ వచ్చే సీన్స్ పెద్దగా ఆకట్టుకోవని, అయితే సినిమాలో హీరో అఖిల్ పరిణితి చెందిన నటన, పూజా హెగ్డే అందం, అభినయం, సాంగ్స్, బీజీఎమ్, తో పాటు మధ్యలో అలరించే కామెడీ సీన్స్, అన్నిటికంటే ముఖ్యంగా విజువల్స్ ఎంతో బాగున్నాయని, కాగా సినిమా యొక్క కథనాన్ని మరింత ఆసక్తికరంగా దర్శకుడు బాస్కర్ తీసి ఉంటె తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టి ఉండేదని పలువురు ప్రేక్షకులు అంటున్నారు. కాగా రేపు, ఎల్లుండి ఈ రెండు రోజులు వీక్ ఎండ్ డేస్ మినహాయిస్తే, ఇక రాబోయే సోమవారం నుండి ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ని బట్టి దీని రిజల్ట్ ని పక్కాగా చెప్పవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి అప్పటి నుండి బ్యాచిలర్ ఏ స్థాయిలో కలెక్షన్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: