రానా దగ్గుబాటి హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం, ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది, ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ కు ముందు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా విడుదల తేదీని కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో, ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాల కు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. ఇలా జనాలలో ఇప్పటికే ఎంతో హైప్ క్రియేట్ చేసిన విరాట పర్వం సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతున్నారో మాత్రం ఇప్పటి వరకు చిత్ర బృందం ప్రకటించలేదు.
ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ బాబు ప్రొడక్షన్స్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే విరాట పర్వం చిత్ర బృందం తాజా గా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా బయటకు వదిలారు. ఇలా విరాట పర్వం చిత్ర బృందం బయటకు వదిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చారు. మరి రానా దగ్గుబాటి విరాట పర్వం సినిమాతో బాక్సాఫీసు దగ్గర ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటాడుడో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. రానా ఈ సినిమాతో పాటు మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.