శర్వానంద్, సిద్ధార్థ్ లు తప్పా మరెవరు చేయలేని విధంగా!

P.Nishanth Kumar
శర్వానంద్ ఎలాంటి నటుడో మన అందరికీ తెలిసిందే. తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు చేసిన పాత్రలను ఏ సినిమాలోనూ మళ్ళీ రిపీట్ చేయలేదు. ఆ విధంగా వైవిధ్యభరిత మైన సినిమాలు చేసే నటుడిగా ఎన్నో గొప్ప కీర్తి ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. లవర్ బాయ్ గా ఎమోషనల్ నటుడిగా యాక్షన్ హీరోగా ఎన్నో పాత్రల ద్వారా ప్రేక్షకులను సంతృప్తి పరిచిన ఆయన ఈసారి మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అందరూ ఎప్పుడూ తన నుంచి ఆశించిన విధంగానే గొప్ప పాత్ర ను పోషించి ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి ముఖ్య కారణం అయ్యాడు.

అర్జున్ పాత్రలో మంచి భావోద్వేగం ఉన్న పాత్రను చేయడంతో పాటు తనలోని గొప్ప నటుడిని వెలికి తీసి మరి ఈ చిత్రంలో నటించాడు శర్వా. తన కెరీర్ లో ఇలాంటి విభిన్నమైన పాత్రను ఎమోషనల్ ఫీల్ కలిగిన పాత్రను ఇప్పటివరకు శర్వానంద్ చేయలేదనే చెప్పాలి.  బహుశా ఇతర హీరోలు దీన్ని రిజెక్ట్ చేసి శర్వానంద్ సినిమాగా చేయడం నిజం గా ఆయన అదృష్టమనే చెప్పాలి. శర్వానంద్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయే పాత్ర ఇది.  ఎమోషనల్ ప్రేమకథా చిత్రాల్లో ఉండే ఎమోషన్ చివరి వరకు క్యారీ చేసి శర్వానంద్ నటుడిగా మరొకసారి ప్రేక్షకులకు తన ప్రతిభ చాటి చెప్పాడు. 

ఇక చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న సిద్ధార్థ్ తన రీ ఎంట్రీ పర్ఫెక్ట్ గా ఉండేలా ఈ సినిమాను ఎంచుకున్నాడు. మధ్య మధ్యలో కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా వచ్చినా కూడా సిద్ధార్థ కు తెలుగులో అవేవి పేరు తీసుకు రాలేదు. కానీ మహా సముద్రం సినిమాలో ఆయన చేసిన విజయ్ పాత్రకు మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  చెప్పాలంటే హీరో శర్వానంద్ పాత్ర కంటే సిద్ధార్థ్ పోషించిన పాత్రనే చాలా పవర్ఫుల్ గా ఉంది. ఎమోషనల్ గా కూడా ఉంది. సిద్ధార్థ కు ఇది అక్షరాల మంచి సినిమానే. మరి దీని తర్వాత ఆయనకు ఎలాంటి సినిమా అవకాశాలు వస్తాయి. ఎలా ప్రేక్షకులను అలరిస్థాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: