ఆయనని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని అంటున్నారు పూజా .... ??

GVK Writings
ఒకలైలా కోసం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తరువాత వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ముకుంద లో కూడా యాక్ట్ చేసారు. అయితే ఆమెకి కెరీర్ పరంగా ఒకింత మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం డీజే, అప్పట్లో అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ ఈ సినిమా తీశారు.
ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత మూవీ తో ఏకంగా భారీ విజయం అందుకున్న పూజా హెగ్డే, దాని అనంతరం సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి తీసిన మహర్షి లో కూడా నటించి దానితో కూడ హిట్ అందుకున్నారు. ఆపైన మరొక్కసారి వరుణ్ హీరోగా హరీష్ శంకర్ తీసిన గడ్డలకొండ గణేష్, అలానే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలవైకుంఠపురములో మూవీస్ చేసిన పూజా, వాటి ద్వారా కూడా విజయాలు అందుకున్నారు.
అయితే మొదటి నుండి కూడా తన అందం తో పాటు ఆకట్టుకునే అభినయంతో ఆడియన్స్ ని ఎంతో అలరిస్తున్న పూజా హెగ్డే తన కెరీర్ బిగినింగ్ లో కొంత ఇబ్బందులు పడ్డానని, అయితే ఆ తరువాత తనని నటిగా ఎంతో ప్రోత్సహించి ఛాన్స్ లు ఇచ్చిన వారిలో హరీష్ శంకర్ ముఖ్యులు అని చెప్తూ ఉంటారు పూజా. ఇక ఆయన తో డీజే, గడ్డలకొండ గణేష్ సినిమాలు చేసిన పూజా హెగ్డే, త్వరలో పవర్ స్టార్ తో ఆయన టీయనున్న భవదీయుడు భగత్ సింగ్ లో కూడా యాక్ట్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఇదే కనుక నిజం అయితే మరొక్కసారి హరీష్ సినిమాలో పూజ మరొక అద్భుతమైన ఛాన్స్ అందుకున్నట్లే, అలానే ఫస్ట్ టైం పవర్ స్టార్ తో ఆమెకు జోడీ కట్టే అవకాశం లభించినట్లే అంటున్నారు సినిమా విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: