మహాసముద్రం స్ట్రీమింగ్ రైట్స్ పొందిన ప్రముఖ ఓ.టీ.టీ సంస్థ...!

murali krishna
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో అయిన శర్వానంద్ మరియు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'మహాసముద్రంలో నటిస్తున్నాడని అందరికి తెలుసు..
ఈ సినిమాలో హీరో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడని అందరికి తెలిసిందే. చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అజయ్ భూపతి తో పాటు శర్వానంద్ మరియు సిద్ధార్థ్ కూడా ఈ సినిమా హిట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయని తెలుస్తుంది. అక్టోబర్ 14న దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారని సమాచారం. దీంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చెయ్యగా ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలుస్తుంది.
ఇక ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది.రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారని సమాచారం.ఇక ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి వుంది.. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ సొంత చేసుకుందని తెలుస్తుంది.దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిందని తెలుస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉందని సమాచారం. ఇక ఈ సినిమాలో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా వారి పక్కన అను ఇమ్మాన్యుయేల్ మరియు అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారని అందరికి తెలుసు. ఇక ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారని సమాచారం.. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారని తెలుస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: