అది నా ఫాన్స్ కు ఎప్పటికి గుర్తుండిపోతుంది : పూజా హెగ్డే

praveen
పూజా హెగ్డే..  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.  గత కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.  తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరికీ కట్టిపడేసింది అని చెప్పాలి.  ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడికి పోటీ ఇచ్చే హీరోయిన్ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.  ఇక రోజు రోజుకి ఈ అమ్మడికి అంతకంతకు క్రేజ్ పెరిగి పోతూనే ఉంది. అయితే తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ సొగసరి.



 ఇకపోతే ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కాగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .  అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా అఖిల్ మొదటి హిట్ అవబోతుంది అని అభిమానులు భావిస్తున్నారు.  ఇకపోతే ఇప్పుడు వరకు పూజా హెగ్డే ని ఎన్నో గ్లామర్ పాత్రలో చూశారూ తెలుగు ప్రేక్షకులు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మాత్రం తన పాత్ర కొత్తగా ఉండబోతుంది అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో తన పాత్రకు వచ్చే స్పందన చూడటానికి తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అని చెబుతోంది.



 తన కెరీర్లో తొలిసారిగా హుషారైన పాత్రలో నటించాను అంటూ పూజా హెగ్డే తెలిపింది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా  ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం ఇంకా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నేను విభా అనే పాత్రలో నటించాను. స్టాండప్ కమెడియన్ పాత్రలు నటించాను. అయితే స్టాండ్ అప్ కమెడియన్ పాత్రలో నటించడానికి ప్రత్యేకమైన హావభావాలు చూపించాల్సి ఉంటుంది   దీని కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. నా కెరీర్లో ఇప్పటివరకు నేను చేసిన పాత్రల కంటే ఈ పాత్ర మాత్రం ప్రేక్షకులందరికీ ఇప్పటికీ గుర్తుండి పోతుంది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: