హాట్ లుక్స్ తో మైమరపిస్తున్న లావణ్య త్రిపాటి..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి తన అమాయకపు నటనతో తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ నటిగా మాత్రం లావణ్య త్రిపాటి కి అందాల రాక్షసి సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మరియు ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న లావణ్య త్రిపాటి  కి టాలీవుడ్ లో  క్రేజీ ఆఫర్లు కూడా దక్కాయి.


అందులో భాగంగా బలే బలే మగాడివోయ్, మిస్టర్, అర్జున్ సురవరం, యుద్ధం శరణం, సోగ్గాడే చిన్నినాయన, ఏ వన్ ఎక్స్ ప్రెస్ వంటి పలు చిత్రాల్లో నటించిన లావణ్య త్రిపాఠి తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడిపే లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, మరియు తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, అలాగే తన డైలీ ఆక్టివిటీస్ ను లావణ్య త్రిపాటి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా లావణ్య త్రిపాఠి అప్పుడప్పుడు తన అంద చందాలను ప్రదర్శించేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ తన అభిమానులను వేడెక్కిస్తు ఉంటుంది. ఇది లా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో లావణ్య త్రిపాటి పూర్తి నలుపు రంగు దుస్తులను ధరించి ఉంది. లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: