మా పోరు : మళ్లీ అదే మాట చెబుతున్న మోహన్ బాబు?
ఈరోజు ఉదయం నుంచీ మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మా సభ్యులందరూ తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మరికొన్ని గంటల్లో మా అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎవరు అనే విషయం తేలిపోతుంది. అయితే మా ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నో చిత్రవిచిత్రమైన సన్నివేశాలు కూడా జరుగుతున్నాయి. మొన్నటివరకు ఒకరిపై ఒకరికి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నవారు మేము అంతా ఒకటే అంటూ చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇకపోతే ఓవైపు ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ వుండగా మరో వైపు మంచు ఫామిలీ సపోర్టుతో విష్ణు పోటీ చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచీ మోహన్ బాబు మా ఎన్నికలపై మోహన్ బాబు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈసారి మా ఎన్నికల్లో ఎవరు గెలిచేది లేదని తన కుమారుడు మంచు విష్ణు గెలుస్తాడు అంటూ ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. గెలవ బోడు అనే రెండో ఆలోచన కూడా లేదు అంటూ చెప్పారు మోహన్ బాబు. ఇక ఇటీవలే మా ఎన్నికల పోలింగ్ సందర్భంగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అందరి ఆశీస్సులతో మంచు విష్ణు గెలుస్తాడు మా ఎన్నికలు రామ రావణ యుద్ధంలా ఉన్నాయి అంటూ మోహన్బాబు భారీ డైలాగులు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ ఎన్నికల ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ ఎలాంటి ఫలితాలు రాకుండానే ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు అవసరమా అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే పరువు పోతుంది కదా అని అంటున్నారు నెటిజన్లు.