మీరు ఎంత బాధలో ఉన్నా సరే.. ఈ సినిమా చూస్తే హం ఫట్?
సినిమా అంటే ప్రధానంగా ఎంటర్ టైన్ మెంట్..అయితే ఆడియన్స్ ని ఫుల్ గా మూడు గంటలపాటు ఎంటర్టైన్ చేయడంలో విక్టరీ వెంకటేష్ దిట్ట అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు నటనలోను యాక్షన్ లోను ప్రధానంగా కామెడీ టైమింగ్ తో అదరగొట్టగల హీరో వెంకీ. ప్రేమ, వారసుడొచ్చాడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా అప్పటి నుండి నేడు గోపాల గోపాల, బాబు బంగారం F2 వరకు కూడా చూస్తే దాదాపుగా ప్రతి సినిమాలోనూ తనదైన శైలిలో కామెడీని పండించి ప్రేక్షకుల పెదవులపై నవ్వుల పువ్వులు పూయిస్తాడు వెంకీ. ముఖ్యంగా "నువ్వు నాకు నచ్చావ్" చిత్రంలో వెంకీ కామెడీ అంతా ఇంతా కాదు.
ఈ సినిమా వచ్చి ఇరవై ఏళ్లు గడుస్తున్నా కొన్ని వందల సార్లు ఈ సినిమాను చూసినా ఇప్పటికీ టీవిలో ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు చూడడానికి రెడీ అయిపోతారు. పదే పదే చూసిన బోర్ కొట్టని చిత్రాలలో నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఒకటి. ఇందులో మేజర్ ఎలిమెంట్ వెంకీ పండించిన కామెడీ అనే చెప్పాలి. ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్ వంటి కమెడియన్స్ తో కలసి వెంకీ చేసిన కామెడీ సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో నవ్వుల సునామీ తెప్పించాడు విక్టరీ వెంకటేష్. ఇలా ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంతగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది నువ్వు నాకు నచ్చావ్ చిత్రం.