పోసాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నాగ బాబు..!

murali krishna
కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్న సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అందరికి తెలుసు. వీటితో పాటు త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్టు జరుగుతోందని సమాచారం.

బరిలో చివరికి ప్రకాశ్‌రాజ్‌ మరియు మంచు విష్ణు ప్యానల్స్‌ నిలువగా  వారి మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతోందని తెలుస్తుంది.. ఈ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారాయని సమాచారం. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు మద్దతునిస్తున్న మెగా నటుడు నాగబాబు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొని అసోసియేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తుంది. రిపబ్లిక్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌ - పోసాని మధ్య జరిగిన మాటల యుద్ధంపై నాగబాబు స్పందించారని సమాచారం.

నాగబాబు మాట్లాడుతూ 'మా' అనేది చాలా చిన్న అసోసియేషన్ అని, సుమారుగా 900 మంది సభ్యులు ఉన్నారని కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా 300 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పుకొచ్చారట . కాగా ఈ సంవత్సరం మరో 200 మంది సభ్యులు కూడా ఓటువేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మొదటి నుంచి ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కే మద్దతు ప్రకటించామని చెబుతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటివరకూ 'మా' అధ్యక్షులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ దాని సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారని కానీ నరేశ్‌ పాలనలో మాత్రమే అసోసియేషన్‌ అభివృద్ధి జరగలేదని తెలిపారని సమాచారం. అనంతరం ప్రకాశ్‌రాజ్‌ దేశద్రోహి అంటూ సీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలు తనకు కోపం తెప్పించాయని చెప్పుకొచ్చార.ట ప్రకాశ్‌ కూడా ఈ దేశస్థుడే అని, కాకపోతే ఆయన దేవుడిని నమ్మడు అని చెప్పాడట.''మా'ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఉన్న వ్యక్తి అని నాగబాబు మా సభ్యులకు సూచించాడని సమాచారం.

తమ ఫ్యామిలీ అంతా ఎప్పుడూ ఒకే తాటిమీద ఉంటామని చెప్పారట.మా అన్నయ్య ఏ దారిలో వెళ్తే మాది అదే దారి అని అన్నాడని . ఇది ఇలా ఉండగా రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారని తెలుస్తుంది.. కొన్ని వ్యక్తిగత ఆరోపణలు తప్ప మిగతావన్నీ ఇండస్ట్రీ బాగు గురించే పవన్ మాట్లాడాడని ఆయన అన్నారట. అనంతరం పోసాని పవన్‌ కాంట్రవర్సీపై మాట్లాడాలని ఒక రిపోర్టర్ అడగగా 'ఆ వ్యక్తి పేరు పలికి నా నోరు పాడుచేసుకోవాలనుకోవడం లేదని స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారని తెలుస్తుంది. అలాగే, ప్రకాశ్‌రాజ్‌కి ఓటు వేయొద్దంటూ సీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: