ఒక సినిమా విజయంలో కామెడీ పాత్ర ఏమిటి?
అయితే హాస్యం శృతి మించకుండా సహజ దోరణిలో సమయానికి సందర్భానికి అనుగుణంగా సహజమైన కామెడీ పండించగలిగితే ఇక ఆ సినిమాకి తిరుగేలేదు. నాటి నుండి నేటి వరకు కూడా ఎందరో డైరెక్టర్లు నమ్ముకున్న సూత్రం ఇది. సీనియర్ దర్శకుడు జంధ్యాల దగ్గర నుండి నేటి వరకు ఎందరో దర్శకులు స్వఛ్చమైన కామెడీ చిత్రాలను తీసి ఇండస్ట్రీలో స్టార్ దర్శకులుగా ఎదిగిన వారు ఉన్నారు. అంతగా కామెడీ అనేది సినిమాలో మేజర్ రోల్ వహిస్తుంది. అయితే పాయింట్ ను బాగా అర్దం చేసుకున్న ఎందరో హీరోలు కామెడీకి ప్రాధాన్య మిస్తూ ఓ వైపు హీరోయిజం చూపిస్తూనే మరో వైపు కమెడియన్ గా అంతకుమించి హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునీ కెరీర్ గ్రాఫ్ ను పెంచేసుకున్నారు.
సాధారణంగా అయితే సినిమాలలో ఎక్కువగా కమెడియన్స్ ని ఆకర్షిస్తుంది. కానీ కొందరు హీరోలు మాత్రం కమిడియన్లకు మించి కామెడీని కురిపించి వాహ్వా అనిపిస్తుంటారు. ఆ రేంజ్ లో కామెడీ టైమింగ్ తో హాస్యాన్ని పండిస్తూ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. అలాంటి వారిని కనుక ఓ సారి గుర్తు చేసుకుంటే... నటుడు రాజేంద్రప్రసాద్, చిరంజీవి, వెంకటేష్, రవి తేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా ఎంతో మంది హీరోలు తమ చిత్రాల్లో కమెడియన్ కు మించి కామెడీని పండించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారే. అదే వారికి మరింత ప్లస్ గా మారి సినీ రంగంలో ఉన్నత స్థానాలను అందుకునేలా చేసింది అని చెప్పొచ్చు. ఇక బెస్ట్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బెస్ట్ కమెడియన్ల విషయానికొస్తే అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ సునీల్, వెన్నెల కిషోర్ వంటి వారు తమ కామెడీతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్నారు.