మైక్ టైసన్ వల్లే లైగర్ లేట్..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా చేస్తున్న చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల పై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు.  ఇప్పుడున్న స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకులను అలరించబోతున్నారు విజయ్ దేవరకొండ.

అంతేకాదు తన హెయిర్ స్టైల్ తో కూడా సరికొత్తగా ఆకట్టుకోబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఆ అప్డేట్ లు చూసిన తర్వాత రౌడీ స్టార్ చెప్పిన విధంగానే ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. ఇకపోతే ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ తైసన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబందంచిన ఓ స్పెషల్ టీజర్ ఆయన అభిమానులను ఎంతగానో అలరించింది.

ఇలా వరుస అప్డేట్లతో అంతకంతకు ఆసక్తిని పెంచుతున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అవుతుంది అని ప్రేక్షకుల ఆందోళన పడుతున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమా విడుదల పై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. విడుదల కి కొంత సమయం ఉందని తెలిపారు. ఒక  ఫారిన్ షెడ్యూల్ ఉందని అక్కడ మైక్ టైసన్ తో షూట్ చేయాల్సి ఉందని అందుకే ఈ సినిమా లేట్ అవుతుందని ఆయన వెల్లడించారు. మైక్ టైసన్ డేట్ లో ఇన్ని రోజులు ఇవ్వకపోవడం కారణంగానే సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది అని తెలిపారు. గోవాలో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరించారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: