బాలీవుడ్లో వరుస కడుతున్న రాముడి సినిమాలు..కారణం..?

Divya
రామాయణం, మహాభారతం లాంటి పౌరాణిక కథలు ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చూసినా చాలా ఆనందంగా ఉండడంతో పాటు ప్రతి సారి ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇప్పటికే టాలీవుడ్లో రాముడి జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అవన్నీ ఎన్నిసార్లు వచ్చినా ప్రతి సారి కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.. గత కొన్ని సంవత్సరాల నుండి రాముడు సినిమాలు తెరపై కనిపించలేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో రాముని సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి..


మొన్నటి వరకు టాలీవుడ్ లో రాముడి సినిమాలు ఎక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో ఎందుకు వరుస సినిమాలు వస్తున్నాయి అనుకుంటుండగా ఆసక్తికరమైన సమాధానం కూడా వస్తోంది.. అదేమిటంటే రామాయణం నేపథ్యంలో రాముడి పాత్ర తో వచ్చే సినిమాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయానికి వస్తే.. బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా రాముడి రామాయణం నేపథ్య సినిమాలు తీయడానికి ముఖ్య కారణం ఒకటే.. ఒక ప్రధాన పార్టీ మెప్పు కోసమే అని అంటున్నారు అక్కడి సినీ ఇండస్ట్రీ వర్గాల వారు..


ఒకవైపు అయోధ్యలో రామాలయం కూడా పూర్తవుతుండడం, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి సినిమాలు తీసి ఆ పార్టీ పెద్దాయన మెప్పు పొందాలని హిందీ సినీ పరిశ్రమ ఆరాటపడుతోంది అని సినీ విమర్శకులు కూడా అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటి వరకు రామాయణం నేపథ్యంలో ఏ ఏ సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..


1. ఆది పురుష్:
ప్రభాస్ రాముడిగా, సీతగా కృతిసనన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఓమ్ రౌత్  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారు.

2. సీత:
కంగనా రనౌత్ ప్రధానపాత్రలో సీత అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఇక ఇందులో మిగతా పాత్రలు తెలియాల్సి ఉంది.

ఇక ఇవే కాకుండా అల్లు అరవింద్ , మధు మంతెన కలిసి త్రీడీలో రామాయణం కథనాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని పనులు జరిగినప్పటికీ కారణంగా షూటింగ్ ముందుకు వెళ్లలేదు. అక్షయ్ కుమార్ కూడా  రామసేతు అనే పేరుతో రామాయణం ఇతివృత్తం నేపథ్యంలో కూడా ఒక సినిమాలో చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: