ఓటుకు పదివేలు.. బాబోయ్ ఏంటిది?

P.Nishanth Kumar
మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకు ఎంతో రసవత్తరమైన పోటీ నెలకొంటుంది. ప్రెసిడెంట్ పోటీ దారులుగా  ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ల మధ్య పోటీ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది.  మొన్నటిదాకా ఎంతో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని అందరూ అనుకోగా గత నాలుగు రోజులుగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న విమర్శల పర్వం ఈ ఎన్నికలు రసవత్తరంగా జరగడం ఖాయం అని తెలుస్తోంది.

విమర్శల మీద విమర్శలు చేసుకుంటూ వీరిద్దరూ ఒకరి పై ఒకరు దారుణం గా విమర్శించుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సంచలనం కలిగిస్తోంది. బయటి వారికి ఇది చూడడానికి ఎంతో వినోదం గా కనిపించినా కూడా ఈ ఇద్దరు పోటీదారులు మాత్రం ఈ పోటీ ని ఎంతో సీరియస్ గా తీసుకున్నారు అని అనిపిస్తుంది. అందుకే పర్సనల్ గా తీసుకొని మరి వారు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలను చేసుకుంటున్నారు. మొదటి నుంచి మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండగా ప్రకాష్ రాజ్ మాత్రం సిన్సియర్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అని మా ఓటర్లు చెబుతుండడం గమనార్హం.

తాజాగా ఈ ఇష్యూ పై మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడగా ఆయన మాటలలో ఓటుకు పదివేలు చొప్పున డబ్బులు ఇస్తున్నారని చెప్పడం సంచలనం కలిగిస్తుంది. మా మసక వారి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మా సభ్యులకు డబ్బు ఆశ చూపించడం దారుణమైన విషయం అని ఆయన చెబుతున్నారు. ఏదేమైనా  ఈ విషయంలో మా ప్రతిష్ట పోతుందని చెప్పవచ్చు. 25 ఏళ్లుగా మా లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోవడం లేదు. కానీ గత నాలుగేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఆపేందుకు ఎవరూ ముందుకు రాని నేపథ్యంలో ఈ విమర్శలు ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.  అక్టోబర్ 10 తేదీన మా ఎన్నికలు జరగనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: