బిగ్ బాస్ 5 : రవి, కాజల్ మధ్య పెద్ద గొడవ?

praveen
బిగ్ బాస్..  ప్రతి రోజు బుల్లితెర పై  ఈ కార్యక్రమానికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం.  బిగ్ బాస్ లోని కంటెస్టెంట్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇక ఆ గొడవ బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిపోతుంది.  అయితే ఇటీవలే సోమవారం రోజున బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగా  గార్డెన్ ఏరియా లో కాకుండా.. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి రహస్యంగా నామినేషన్ ప్రక్రియ చేపట్టారు బిగ్ బాస్.  ఈ క్రమంలోనే  ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేశారు.  అయితే ఇక ఈ రోజు నిన్న ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారు అనే విషయాన్ని బిగ్బాస్ చెప్పేశారు.


 ఇక మరోసారి కంటెస్టెంట్స్ మధ్య రివేంజ్ స్టోరీ ప్రారంభం అయ్యింది. ఇకపోతే ఇటీవలే ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదల అయింది. ఇక ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ ప్రోమో లో భాగంగా రవి లోబో బెడ్ పై పడుకున్న సమయంలో కాజల్  వారిని కామెంట్ చేస్తుంది. మొన్నటి వరకు బాత్రూంలో ఉన్న రవి లోబో ఇక ఇప్పుడు ఏకంగా డిన్నర్కి వచ్చేశారు అంటూ కామెంట్ చేయడం తో ఇద్దరు ఫీల్ అవుతారు.  ఇక ఆ తర్వాత అదే విషయాన్ని మనసులో పెట్టుకున్న రవి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కాజల్ తో గొడవ పడతాడు.




 నీకు ఆ మాత్రం తెలియదా అలా ఎలా అంటావ్ అంటూ రవి ప్రశ్నిస్తాడు. అయితే నేను జోక్ గా అన్నాను సీరియస్గా తీసుకుంటారు అని అనుకోలేదు అంటూ కాజల్ చెబుతోంది..  నీకు జోక్ కావచ్చు అది ఎదుటివారికి జోక్ కాదు అంటూ రవి సీరియస్ అవుతాడు.  ఆమాత్రం తెలియకుండా ఎలా వస్తారు అంటూ రవి అనడంతో కాజల్ కూడా సీరియస్ అవుతుంది. ఎలా రావడం ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ రవి అంటూ ప్రశ్నిస్తుంది. అయితే నాతో గొడవ పడూ కానీ సరైన రీజన్ చెప్పి గొడవ పడు అంటూ రవి చెబుతాడు.  ఇద్దరు గొడవ కాస్త ఈరోజు ఎపిసోడ్ లో హాట్ టాపిక్గా మారే లాగే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: