నాజర్.. వందకు వంద శాతం ఆ పాత్రలో జీవించి ఆ పాత్రకు ప్రాణం పోస్తాడు.

P.Nishanth Kumar
ఆయన ఏ పాత్ర వేసిన ఆ పాత్ర ఎంతో మురిసి పోతూ ఉంటుంది. వందకు వంద శాతం ఆ పాత్రలో జీవించి ఆ పాత్రకు ప్రాణం పోస్తాడు. సినిమాలో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ పాత్ర ద్వారా కూడా మంచి క్రేజ్ సంపాదించవచ్చు అని చాటి చెప్పారు. ప్రేక్షకులలో ఆ పాత్ర గుర్తు పెట్టుకునే నటన చేస్తే అసలు మరచి పోరు అని నిరూపించాడు నటుడు నాజర్.  సినిమా పరిశ్రమలోకి ఎప్పుడో వచ్చిన ఆయన ఇప్పటి వరకు వందల సినిమాల్లో నటించి అలరించాడు.

 మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించి అలరించాడు.  తెలుగు సినిమాల హీరోల నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. తమిళనాడులో 1958 వ సంవత్సరంలో జన్మించిన నాజర్ అజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ మణిరత్నం బాంబే శంకర్ జీన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు పూరి జగన్నాథ్ పోకిరి వంటి సినిమాలలో అద్వితీయమైన నటనను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు.అయన పోషించిన బాహుబలి బిజ్జల దేవా పాత్ర న భూతో న భవిష్యత్. 

అలాగే చంటి సినిమాలో పోషించిన ప్రతినాయకుడి పాత్రకు నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాలో నటనకు ఆయనకు నంది అవార్డు లభించింది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను ఎంతో కనువిందు చేస్తున్నాడు.  నాజర్ కు ముగ్గురు అబ్బాయిలు. పెద్దబ్బాయి మొదట్లో సినిమాల్లో నటిస్తాడని వార్తలు వచ్చిన తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. 2014లో అతను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. 1977లో అవకాశాల కోసం మద్రాసు వచ్చి హోటల్లో పని చేసి అక్కడి నుంచి ఆయన సినిమా అవకాశాల వేట మొదలు పెట్టాడు. ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సౌత్ లోనే ఆయన మంచి పేరున్న సహాయనటుడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: