ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. నాగచైతన్య ట్వీట్ వైరల్?

praveen
మొన్నటివరకు తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా ఉన్న నాగచైతన్య సమంత ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఎన్నో రోజుల నుంచి విడాకుల గురించి పలు రకాల వార్తలు వస్తున్నప్పటికీ  ఒకరిపట్ల ఒకరు ఎంతో ప్రేమగా ఉండే వీరు ఎందుకు వెళ్లిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరు  ప్రేమ పెళ్లి బంధానికి స్వస్తి పలికారు.  ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో ఒకే రకమైన పోస్టు పెట్టారు. భార్యాభర్తలుగా విడిపోతామని.. వేరు వేరు దారిలో వెళ్లాలని అనుకుంటున్నాము..  స్నేహితులుగా మాత్రం కొనసాగుతాము అంటూ పోస్ట్ పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చారు ఈ దంపతులు.



 అయితే విడాకుల ప్రకటన తర్వాత సమంత వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పటికీ నాగచైతన్య మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ లు పెట్టలేదు. ఇటీవలే నాగచైతన్య పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది.  గత కొన్ని రోజుల క్రితం మెగాహీరో సాయిధరమ్తేజ్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలపాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.  ఇటీవలే తాను కోరుకుంటున్నానని తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు అంటూ సాయి ధరంతేజ్ ఒక పోస్ట్ పెట్టి అభిమానులు అందరిలో ధైర్యం నింపాడు .



 అయితే సాయి ధరంతేజ్ పెట్టిన పోస్ట్ పై సినీ సెలబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. నువ్వు కోలుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ సాయి ధరంతేజ్ కి పోస్టులు పెడుతున్నారు. ఇక ఇటీవలే సాయి తేత్ పెట్టిన పోస్ట్ పై స్పందించిన హీరో నాగచైతన్య సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడూ నాకు చాలా హ్యాపీగా ఉంది.. ప్రేమతో.. అంటూ నాగచైతన్య పెట్టిన ట్విట్  అది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక సమంత తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత నాగచైతన్య మొదటి ట్విట్ ఇదే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: