చిరంజీవి స్నేహితుడే.. కానీ.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్?
ఇక ఎన్నో ఏళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు లు స్నేహితులు కాదు శత్రువులు వారి మధ్య చిన్నపాటి శత్రుత్వం కొనసాగుతుంది అన్న విధంగానే ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో. కానీ గత ఏడాది మా ఎన్నికల సమయంలో ఓ సమావేశం జరుగుతున్న సమయంలో టాలీవుడ్ పెద్దలు గా ఉన్న వీరిద్దరూ ఒక స్టేజ్ పై కూర్చున్నారు. ఇక ఆ సమయంలో చిరంజీవి ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న మోహన్ బాబు వచ్చి చిరంజీవిని కౌగిలించుకుని చెంపపై ముద్దు ఇస్తాడు. మేము మంచి స్నేహితులం అని చెబుతాడు . అప్పటి నుంచి వీరి మధ్య శత్రుత్వం ఏమీ లేదని మంచి స్నేహితులు గానె కొనసాగుతున్నారు అంటూ అందరూ నమ్మారు.
ఇకపోతే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న స్నేహబంధం పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఎంతో మంది ప్రముఖులు ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఓపెన్ హార్ట్ రాధాకృష్ణ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక మోహన్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు అడగగా.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేసారు. చిరంజీవి మధ్య ఒకప్పుడు శత్రుత్వం ఉంది అనే వారు మీరు నిజంగా ఇప్పటికీ మిత్రులేనా లేదా నటిస్తున్నారా అని అడిగాడు.. స్నేహితులలో చాలా రకాలు ఉంటాయి. అసలైన స్నేహితులు అంటే రజినీకాంత్, అంబరీష్ లాంటివాళ్ళు అంటూ చెబుతాడు మోహన్ బాబు. అంటే చిరంజీవితో అసలు స్నేహం లేదు అని చెబుతున్నారా అని రాధాకృష్ణ ప్రశ్నించగా.. మేము సినిమా స్నేహితులం అంటూ చెబుతాడు మోహన్ బాబు. ఇక మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.