పవన్ ఫ్యాన్స్ ను బండ బూతులు తిట్టిన బీజేపీ మహిళా నేత..!

MADDIBOINA AJAY KUMAR
బిజెపి మహిళా నాయకురాలు, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి పవన్ కళ్యాణ్ పై అతడి అభిమానులపై రెచ్చిపోయింది. శ్వేత రెడ్డి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటో పై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో శ్వేత రెడ్డి పవన్ కళ్యాణ్ అభిమానుల పై పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ బండబూతులు తిడుతూ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. వీడియో లో బూతులు తిడుతున్న సమయంలో అలాంటి బూతులు మాట్లాడుతున్నందుకు మోడీ గారు క్షమించాలి అంటూ... మోడీ గారు తండ్రితో సమానం అంటూ పేర్కొంది. శ్వేత రెడ్డి గురించి ఆటో డ్రైవర్ లను అడగాలంటున్నారు.. నా గురించి మీకేం తెలుసు రా అంటూ రెచ్చిపోయి కడిగి పారేసింది.

 పీకే ఫ్యాన్స్ చదువు సంధ్యా లేని దద్దమ్మలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మహిళల జీవితాలు నాశనం చేశారు అంటూ శ్వేతా రెడ్డి రెచ్చిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలుసని కామెంట్ చేస్తున్నారని మండిపడింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్  ను గౌరవిస్తూ విమర్శించానని కానీ ఇకపై అలా చేయనని శ్వేతా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ ఎంత మంది మహిళల జీవితాలు నాశనం చేశాడో తెలుసా..? అంటూ ప్రశ్నించింది. 

పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాలని అభిమానులకు హితవు పలికింది. నందిని... రేణుదేశాయ్ , పూనమ్ కౌర్ జీవితాలను పవన్ కళ్యాణ్ నాశనం చేశాడని ప్రేమ, పెళ్లి పేరుతో గర్భం చేసి ఆ తర్వాత అబార్షన్లు చేయించాడని... డబ్బులు ఇచ్చి మ్యానేజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ చేసిన అన్యాయాల గురించి పోసాని కృష్ణమురళి, శ్రీ రెడ్డి లు మాట్లాడారని తాను కూడా మాట్లాడుతున్నానని శ్వేతారెడ్డి వెల్లడించింది. ఇక శ్వేత రెడ్డి బిజెపి నాయకురాలు కావడంతో పవన్ కళ్యాణ్ ని బండ బూతులు తిట్టడంతో మరి అలాంటి పవన్ కళ్యాణ్ తో మీ బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకుంది అంటూ నెటిజన్లు  ప్రశ్నిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: