బాలీవుడ్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తున్న RRR రిలీజ్!!

P.Nishanth Kumar
దర్శక ధీరుడు రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 7వ తేదీన విడుదల చేయడం టాలీవుడ్ ఇండస్ట్రీ ను ఒక్కసారి గా షాక్ కి గురి చేసింది. ఎంతో మంది నిర్మాతలు రాజమౌళి నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు ఈ పరిణామంతో తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అలాగే ప్రభాస్ అభిమానులు అయితే రాజమౌళి నీ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మూడు నెలల ముందు తమ సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న హీరోలను కాదని రాజమౌళి తన సినిమాను ఏ విధంగా సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయిస్తాడు అని వారు ఆగ్రహిస్తున్నారు.


నిజానికి రాజమౌళి కూడా తన సినిమాను సంక్రాంతి కానుకగా తీసుకువస్తారని ఎవరు అనుకుని ఉండరు. రూమర్స్ వచ్చిన కూడా అవి పుకార్లు గానే ఉంటాయి అని అందరూ అనుకోగా ఇప్పుడు అదే నిజం అవడం టాలీవుడ్ లో అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఇప్పుడు అదే సమయంలో విడుదల అవుతున్న మిగతా సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. పోస్ట్ ఫోన్ చేసుకోవాలా లేదా అదే సమయంలో విడుదల చేయాలా అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు.


మరోవైపు రాజమౌళి ఈ విడుదలను పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేయగా అది కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ని కూడా ఎంతో ప్రభావితం చేసింది. ఆ సమయంలో భాగంగా బాలీవుడ్ గంగు భాయ్ కథియవాడి,  లాల్ సింగ్ చద్దా వంటి సినిమాలను విడుదల చేయాలని బాలీవుడ్ సిద్ధం అయ్యింది. కానీ రాజమౌళి తన సినిమాను విడుదల చేయడంతో ఆ సినిమాలు వెనక్కి తగ్గక ఉండలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతమందిని బాధపడుతూ రాజమౌళి ఆ రోజున సినిమాను విడుదల చేయడం ఎంతవరకు సమంజసమో ఆయనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: