నాగ్ సెంటిమెంట్ అఖిల్ కి వర్కౌట్ అయ్యేనా!!
చాలా రోజులనుంచి సక్సెస్ కోసం చూస్తున్న అక్కినేని అఖిల్ ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాలని చూడగా కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని సీన్ లు కూడా రీ షూట్ చేయడం తో సినిమా మరి ఇంత లేట్ అయ్యేలా చేసింది. అయితే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత అక్కినేని అభిమానులలో ఆసక్తి ఎంతగానో పెరిగిపోయింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు కూడా భారీ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం హిట్ అనే అందరూ చెబుతున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి అక్కినేని నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి తన కుమారుడు ఎలాగైనా హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే ప్రొడక్షన్ లోకి దిగి మరీ ఆయన పర్యవేక్షించాలని తెలుస్తుంది. అంతే కాదు దీని కోసం ఎడిటర్ గా మారి కొన్ని సీన్స్ ని కూడా కత్తిరించారని టాక్ వినిపిస్తుంది. గతంలో ఇలా ఆయన వ్యవహరించిన సినిమాలు అన్ని సూపర్ హిట్ కాగా ఇప్పుడు అఖిల్ మూవీ కూడా ఆ రేంజ్ లోనే సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తుండటం విశేషం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ను అల్లు అరవింద్ సమర్పించాడు. గోపి సుందర్ సంగీతం అందించారు.