దసరా కు మధురానగరి లో మ్యాజిక్ !
అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ శర్వానంద్ ‘మహాసముద్రం’ సినిమాల మధ్య దసరా రేస్ ఉంటుంది అని అందరు భావిస్తుంటే మధ్యలో ఇప్పుడు రాఘవేంద్రరావు మ్యాజికల్ మూవీ ‘పెళ్ళిసందడి’ విడుదల కాబోతోంది. 25 సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు శ్రీకాంత్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘పెళ్లిసందడి’ ఒక ట్రెండ్ సెటర్. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని రాఘవేంద్రరావు శ్రీకాంత్ కొడుకు రోషన్ ద్వారా ప్రయత్నిస్తున్నాడు.
హీరోయిన్స్ ను చాల అందంగా చూపెడుతూ పూలతో కాయలతో రకరకాలుగా హీరోయిన్స్ గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేసే సీన్స్ లో రాఘవేంద్రరావు సిద్ధహస్తుడు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేయకపోయినా ఈసినిమాకు సంబంధించి విడుదల అవుతున్న పాటలలో అతడి మార్పు కనిపిస్తోంది.
రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోనంకీ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదల అయిన మధురా నగరిలో అంటూ సాగే లిరికల్ వీడియో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఈ పాటలో రోషన్ శ్రీవల్లీల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పాట మధ్యలో రాఘవేంద్రరావు హీరోయిన్ లపై సాధారణంగా విసిరే పూలని కాయల సూత్రాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండటంతో ఈ టెక్నిక్ నేటి యువతకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అన్న సందేహాలు కలుగుతున్నాయి. యూత్ లవ్ స్టోరీలకు ప్రస్థుతం క్రేజ్ బాగానే ఉన్నప్పటికీ కథలో వెరైటీ లేకుంటే యువత ఆదరించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఈసినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉన్నప్పుడు మాత్రమే ఈమూవీ హిట్ అయ్యే ఆస్కారం కనపడుతోంది..