నవంబర్ నుండి డిసెంబర్ కు షిఫ్ట్ అయిన వరుణ్ తేజ్..!

Pulgam Srinivas
కరోనా కారణం వల్ల తెలుగు ఇండస్ట్రీ లో అనేక సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి, మొదట అనుకున్న తేదీలకు సినిమాలు కొన్ని పూర్తయినప్పటికీ థియేటర్లు ఓపెన్ కాకపోవడం వల్ల విడుదలకు నోచుకోలేదు, మరి కొన్ని సినిమాలు విడుదల తేదీ లను ప్రకటించినప్పటికీ ఆ సినిమా షూటింగ్ లు కరోనా కారణంగా నిలిచిపోవడం వల్ల  వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇలా అనేక  సినిమాలు ప్రకటించిన తేదీ లలో విడుదల చేయలేక ఎప్పుడు విడుదల చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో కొన్ని చిత్రాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న సినిమాలలో మెగా ఫ్యామిలీ హీరో  వరుణ్ తేజ్  గని మూవీ కూడా ఉందని చెప్పవచ్చు.


మొదట ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేద్దాము అని చిత్ర బృందం అనుకున్నారు, కాక పోతే కరోనా పరిస్థితుల వల్ల సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయడం కుదరలేదు. ఆ తర్వాత గని సినిమాను దీపావళి కానుకగా నవంబరు నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం ఒక ఆలోచనకు వచ్చినట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి, కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కూడా అసంభవమే అని తెలుస్తుంది. దీపావళి కానుకగా చాలా పెద్ద సినిమాలు పోటీ పడే అవకాశం ఉండటంతో ఈ సినిమాను ఆ సినిమాలతో రేస్ లో ఉంచడం ఇష్టం లేని మేకర్స్ ఈ మూవీ ని నవంబర్ నెల నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గని సినిమాను నవంబర్ నుంచి తప్పించి డిసెంబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి గని సినిమాను డిసెంబర్ నెలలోనే విడుదల చేస్తారో లేదో తెలియాలంటే చిత్ర బృందం నుండి అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: