తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట హీరోలు గా రాణించి ఆ తర్వాత విలన్ లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. మొదట హీరోలుగా మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో విలన్ గా మారి ప్రస్తుతం తెలుగుతో సహా ఇతర భాషలలో కూడా ఫుల్ ఫామ్ లో ఉన్న నటులలో ఒకరు జగపతి బాబు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమాతో జగపతిబాబు విలన్ గా మారాడు. ఈ సినిమాలో హీరో కు సరిసమానమైన విలన్ గా నటించి ఒక పవర్ఫుల్ రోల్ లో జనాలను ఆకట్టుకున్న జగపతిబాబు తెలుగు ఇండస్ట్రీ తో సహా ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమా తో విలన్ గా మారి ప్రస్తుతం ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న జగపతి బాబు లాగానే శ్రీకాంత్ కూడా అంత క్రేజ్ ను తెచ్చుకుంటాడా అనే ప్రశ్న చాలామందిలో ఎదురవుతుంది. దానికి ప్రధాన కారణం ప్రస్తుతం శ్రీకాంత్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
శ్రీకాంత్ కూడా తెలుగులో మంచి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరోగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో విలన్ గా మారాడు. ఇప్పటికే శ్రీకాంత్ నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన యుద్ధం శరణం సినిమా లో విలన్ గా నటించాడు. కాకపోతే ఈ సినిమా శ్రీకాంత్ కు విలన్ గా పెద్ద గుర్తింపు తెచ్చి పెట్టలేదు అనే చెప్పవచ్చు. దర్శకుడు బోయపాటి శ్రీను హీరోలను ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో తన సినిమాలలో విలన్ లను కూడా అదే రేంజ్ లో చూపిస్తాడు. దానితో శ్రీకాంత్ అఖండ సినిమాతో విలన్ గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంటాడు అని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీకాంత్ కు అఖండ సినిమా విలన్ గా ఎంతో గుర్తింపు తీసుకు వస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.