టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. క్రైమ్, కామెడీ ఎంటర్టైనర్, యాక్షన్ మరియు లవ్ స్టోరీ కథాంశంగా సినిమాలు వస్తున్నాయి. అయితే సినిమాల్లో కొన్ని మాత్రమే విజయాలను సాధిస్తున్నాయి. మరికొందరేమో విడుదలకు ముందే భారీ అంచనాలతో వస్తుండగా... బాక్సాఫీసు ముందు మాత్రం బోల్తా కొడుతున్నాయి. ఇలా భారీ అంచనాలతో విడుదలై... బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన సినిమాల్లో ఒకటి.. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి.
ఊసరవెల్లి సినిమా 2011 ఈ సంవత్సరంలో విడుదల కాగా... ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. జై సినిమాలు కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, విద్యుత్ జమ్వాల్, పాయల్ ఘోష్, మురళి శర్మ మరియు జయ ప్రకాష్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందించారు. ఇక ఈ సినిమా 2011 లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1800 థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు ఏకంగా 16 కోట్ల ఫస్ట్ డే వసూళ్లను రాబట్ట గలిగింది ఊసరవెల్లి సినిమా.
యాక్షన్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా... మొదటి మూడు రోజులు బాగా ఆడిన తర్వాత బోల్తా కొట్టింది. భారీ విజయాన్ని సాధిస్తుందని అనుకున్న... ఊసరవెల్లి సినిమా... నిర్మాతలకు నిరాశే చూపింది. మాస్ యాక్షన్ మూవీ గా తెరకెక్కినా... ఆడియన్స్ ను మాత్రం.. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మాఫియా డాన్ నేపథ్యంలో వచ్చిన ఊసరవెల్లి సినిమా లో... ఎన్టీఆర్ మరియు తమన్నా యాక్టింగ్ ఇరగదీశారు. అలాగే జయప్రకాశ్ నారాయణ మరియు ఎన్టీఆర్ ల మధ్య కామెడీ సీన్స్... చాలా బాగున్నాయి. అయితే... సినిమా స్టొరీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఊసరవెల్లి లా కథ కూడా ప్రతి పది నిమిషాలకు మారిపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.