ఎన్టీఆర్ కోసం ప్రభాస్ దానికి ఒప్పుకుంటాడా..?

Pulgam Srinivas
తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ వున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ఒకరు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడిగా పాన్  ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పనులను ఒక పక్క పూర్తి చేస్తూనే మరో పక్క బుల్లితెరపై కూడా జూనియర్ ఎన్టీఆర్ సందడి చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇది వరకే బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో కనిపించి జనాలను మెప్పించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న పట్టు గురించి కూడా కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అయితే ఇలాగే మరొకసారి బుల్లితెర అభిమానులను అలరించడం కోసం జెమిని టీవీ లో  ప్రసారం అవుతున్న మీలో ఎవరు కోటీశ్వరులు షో కు జూనియర్ ఎన్టీఆర్  హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

 ఈ  షో కు  మొదటి గెస్టుగా రామ్ చరణ్ రాగ, ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్లు పూర్తి అయిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేసి మీలో ఎవరు కోటీశ్వరులు షో  లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తెలుగులో మరో స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పటికే ఈ షో  కు వచ్చినట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ ఒకరి తర్వాత ఒకరు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోలను మరియు దర్శకులను  మీలో ఎవరు కోటీశ్వరులు షో కు తీసుకువస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ను కూడా ఎన్టీఆర్ మరి కొద్దిరోజుల్లో ఈ షో కు తీసుకు వస్తాడు అని ఎన్టీఆర్ అభిమానులు , ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఎన్టీఆర్ షో కు ప్రభాస్ వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: