మరోసారి బలుపు చూపించనున్న రవితేజ ... ??
ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, మాస్ యాక్షన్ అంశాల కలయికగా గోపిచంద్ ఈ మూవీ తీశారు. అప్పట్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం శృతి హాసన్ ల కామెడీ తో పాటు ప్రత్యేకంగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఇక ఇటీవల ముచ్చటగా మూడోసారి రవితేజ తో క్రాక్ మూవీ తీసి మరొక సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని, త్వరలో మరొక్కసారి మాస్ రాజాతో పని చేయననున్నారట.
అయితే ఈసారి వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా బలుపు 2 అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం బాలయ్య తో మూవీ కోసం సన్నద్ధం అవుతున్న గోపీచంద్, మరోవైపు బలుపు 2 స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ అంశాలతో గోపీచంద్ రాస్తున్న ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే మరొక్కసారి మాస్ రాజా మాస్ స్టైలిష్ పెర్ఫార్మన్స్ చూడవచ్చన్నమాట.