పవర్ స్టార్ తొలి పారితోషకం ఎంతో తెలుసా...?

murali krishna
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి తొలి సినిమాతో మిశ్రమ ఫలితాన్ని అందుకుందని తెలుస్తుంది.
ప్రముఖ దర్శకుడు అయిన ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారని సమాచారం. ప్రస్తుతం పవన్ ఒక్కో సినిమాకు సుమారు 60 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.
అయితే పవన్ మొదటి సినిమా పారితోషికం మాత్రం కేవలం 5,000 రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. 1996వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలయిందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహారించాడని సమాచారం. అలాగే జానీ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. జనసేన పార్టీని ఎప్పటికైనా అధికారంలోకి తీసుకొనిరావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
తన ప్రతిభతో పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారని తెలుస్తుంది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కగా ఆ సినిమా నిర్మాత అయిన అల్లు అరవింద్ పవన్ కు 5,000 రూపాయల పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది. ఒక మీడియా సంస్థకు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారని సమాచారం. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాకు పవన్ ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.
అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ కొంతకాలం రాజకీయాలలో బిజీ కావడంతో సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అందరికి తెలిసిన విషయమే. వకీల్ సాబ్ సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుస సినిమాలలో నటిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారని సమాచారం. ప్రతి సినిమాకు పవన్ కు క్రేజ్ సంపాదించుకుంటున్నాడు అలాగే దానితో పాటు ఆయన పారితోషికం కూడా పెరుగుతుండటం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: