ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్స్ సిస్టర్స్ ఎవరో తెలుసా..??

N.ANJI
బాలీవూడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇండస్ట్రీలో సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు దాదాపుగా అందరి నటీనటులతో కథానాయికగా నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కరీనా కపూర్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఇక ఆ తరువాత ఆమె బాలీవూడ్ స్టార్ హీరోలైన అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సంజయ్ దత్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, వంటి స్టార్ హీరోల సరసన నటించింది.

అయితే కరీనా కపూర్ 41వ పుట్టిన రోజు కావడంతో కొందరు నెటిజన్లు, కరీనా కపూర్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపార. ఈ తరుణంలోనే కరీనా కపూర్ సోదరి, సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా కరీనా కపూర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాక.. చిన్నప్పుడు కరీనా కపూర్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఎంతగానో ప్రేమించే సోదరి, తనని సపోర్ట్ చేసేటువంటి నటి కరీనా కపూర్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దాంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ చిన్నప్పుడు కరీనా కపూర్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి కరీనా కపూర్ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసందే. దాంతో ఆమె గత కొద్ది కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం కరీనా కపూర్ హిందీలో ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న "ఆది పురుష్" చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" చిత్రం కూడా షూటింగ్ పనులు పూర్తీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: