స్టార్ హీరోలందరికీ తల్లి పాత్రలో నటించిన ప్రముఖ నటీమణి..!

Divya
స్టార్ హీరోల అందరికీ ఈ మధ్యకాలంలో తల్లి పాత్రలో నటించిన ప్రముఖ లేడీ క్యారెక్టర్ అని చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది సినీనటి సుధ.. ఈమె చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలు తమ హవాను కొనసాగిస్తున్న సమయంలో వీరికి అక్కగా ,వదినగా నటించి, ఆ తర్వాత అల్లు అర్జున్ ,మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి హీరోలకు తల్లి పాత్రలో నటించి, తమిళంలో కూడా సూర్య, అజిత్, విశాల్ వంటి హీరోలకు కూడా తల్లి పాత్రలో నటించి మెప్పించింది.


సుధా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో ఏకంగా 500 కుపైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. తమిళనాడులోని శ్రీరంగం అనే ప్రాంతంలో జన్మించింది. ఇక పుట్టి పెరిగింది తమిళంలో అయినప్పటికీ, ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య సహకారంతో ఈమె పూర్తిగా తెలుగు నేర్చుకొని తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగింది. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ,బాలకృష్ణ , నాగార్జున వంటి స్టార్ హీరోలు ఈమెను సొంత అక్క గా ఆదరిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


తాతినేని రామారావు దర్శకత్వం వహించిన తల్లిదండ్రులు అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటి సారి అడుగు పెట్టింది.ఇక అంతకు మంది అలనాటి పౌరాణిక గాధను ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన సినిమా  శ్రీ వినాయక విజయం ద్వారా..ఈమె  బాలనటిగా పరిచయమైనది సుధ..ఆ  తరువాత ఈమె అనేక చిత్రాలలో నటించింది. ఇక ఆ తర్వాత ఈమె ప్రతి ఒక్క సినిమాలో కూడా నటించి ప్రేక్షక ఆదరణ బాగా పొందింది. ఇక ఈమెకు  ఒక కూతురు ఉంది.. ఆమె ఎంబీఏ కూడా పూర్తి చేసింది. కొడుకు లేరన్న కారణంతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఉదయ్ కిరణ్ ను కొడుకుగా దత్తత గా తీసుకోవాలని కూడా అనుకుంది.. కాని కొన్ని కారణాల చేత ఈ కార్యక్రమము కాస్త ఆగి పోయింది. ఉదయ్ కిరణ్  మరణించిన తర్వాత ఈమె తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: