సుకుమార్ లా ఆలోచించడం సరే.. సక్సెస్ అవుతాడా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా సుకుమార్ కు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాలు చూడాలంటే కొంత ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించాలనేది టాలీవుడ్ లో అందరూ చెప్పే మాట. ఆ విధంగా ఆయన దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఆర్య దగ్గర్నుంచి ఇప్పటి రంగస్థలం సినిమా వరకు ఏ దర్శకుడి ఊహకు అందని విధంగా తన మైండ్  ఉపయోగించి సినిమా లు చేసి సూపర్ హిట్లు సాధించుకున్నారు. ముఖ్యం గా ఆయన తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో సినిమా ఆయన మేధస్సుకు పరాకాష్ట అయిన సినిమా అని చెప్పవచ్చు.

అలాగే ఇటీవల రంగస్థలం సినిమా తో తను సరికొత్త దారిలో తన సినిమాలు  తీస్తూ అలా కూడా హిట్ సంపాదిస్తున్నాడు. ఇకపోతే ఆయన కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా మారి తన వద్ద పనిచేస్తున్న శిష్యులకి లేదా టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇస్తూ నిర్మాతగా కూడా సక్సెస్ అవుతున్నాడు. ఇటీవల కాలంలో ఓ టీ టీ లు బాగా డెవలప్ అయిన నేపథ్యంలో సుకుమార్ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అలా సూపర్ హిట్ లు సాధిస్తూ అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు.

 ఈ నేపథ్యంలో కొరటాల శివ కూడా నిర్మాతగా మారి నిర్మాణ సంస్థను ప్రారంభించి తొందర్లోనే తన శిష్యులకు కొత్త దర్శకులకు ఆ నిర్మాణ సంస్థ ద్వారా అవకాశాలు ఇవ్వబోతున్నాడు అని తెలుస్తోంది. సుకుమార్ ఎప్పటినుంచో ఈ విధమైన ప్రణాళిక వేసుకొని సొంతంగా సినిమాలు నిర్మిస్తుంటే కొరటాల శివ ఇప్పుడు సుకుమార్ లా సక్సెస్ కావాలని నిర్మాణ రంగంలోకి దిగుతున్నాడు. మరి కొరటాల శివ ఈ నిర్మాణ రంగంలో ఏ విధంగా సక్సెస్ అవుతాడో చూడాలి. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి ఆశ్చర్య సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల కానుంది మరొకవైపు ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన పనులు కూడా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: