భీమ్లా నాయక్ సెట్ లో యంగ్ డైరెక్టర్ సందడి ... !!

GVK Writings
యువ దర్శకుడు సాగర్ కె చంద్ర ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లతో కలిసి చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తుండగా రానా, డ్యానియల్ శేఖర్ అనే పాత్ర చేస్తున్నారు. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ది పోలీస్ ఆఫీసర్ పాత్ర. కొన్నాళ్ల క్రితం మలయాళంలో రూపొంది అక్కడ ఘన విజయం సొంతం చేసుకున్న అయ్యప్పనుం కోషియం మూవీకి రీమేక్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్నదే భీమ్లా నాయక్.
త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో పాటు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాని నాగ వంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీగా నిర్మస్తున్నారు. అయితే ఒరిజినల్ వర్షన్ లో కొద్దిపాటి చేంజెస్ చేసి ఈ మూవీ స్క్రిప్ట్ ని మన తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా తీస్తున్నారని వినికిడి. థమన్ సుజిత సారథ్యంలో కంపోజ్ చేయబడ్డ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా దర్శకుడు సాగర్ ఈ మూవీ తీస్తున్నారని, రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్.
ఇక విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుండగా పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన టీమ్ తో కలిసి భీమ్లా నాయక్ సెట్ కి ప్రత్యేకంగా విచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. తనకు ఎంతో ఇష్టమైన పవన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా మంచి విజయం అందుకోవడం ఖాయం అని యూనిట్ కి తరుణ్ భాస్కర్ ముందస్తుగా అభినందనలు తెలియచేసినట్లు తెలుస్తోంది. కాగా పవన్ తో తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: