ఎన్టీఆర్ వారసుడిగా తనదైన ముద్ర వేసుకున్న నందమూరి బాలకృష్ణ!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కోట్ల మంది ఫ్యాన్స్ ను కలిగి ఉన్న బాలకృష్ణ తన సినిమాలతో ఇప్పటి వరకు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వచ్చాడు. ఇటీవలే వందో సినిమా చేసిన బాలకృష్ణ ఆ తర్వాత కూడా శరవేగంగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ కు భారీ రేంజ్ లో క్రేజ్ ఉందని చెప్పవచ్చు. చిరంజీవి నాగార్జున వెంకటేష్ తో సమానంగా తన కెరియర్ను మొదలుపెట్టి ఇప్పటివరకు కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి తారక రామారావు వేసిన ముద్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఉన్నన్నాళ్ళు ఈ మహనీయుడు పేరును స్మరించుకుంటూన ఉంటుంది. అంతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ పై ఎన్టీఆర్ ముద్ర వేశారు. ఆయన వారసులుగా వచ్చినవారు కూడా తెలుగు సినిమా పై ముద్ర వేయాలని అలాంటి ప్రయత్నం చేయగా వారిలో బాలకృష్ణ మాత్రమే సక్సెస్ అయ్యాడు. బాల నటుడిగానే తండ్రి సినిమాలలో నటించిన ఈ హీరో నటన ను ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇంతదూరం వచ్చిన బాలకృష్ణ ప్రతి వేదికలో తండ్రి ని స్మరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించాడు.
అలాంటి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ గా చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది ప్రస్తుతం చివరి దశలో చిత్రీకరణలో ఉంది. ఇక పోతే ఈ సినిమా తర్వాత కూడా ప్రేక్షకులను మెప్పించే సినిమాలను అంగీకరిస్తున్నాడు. బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా మంచి మంచి దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈయన ఇంకా ఎలాంటి పాత్రలలో మనకు దర్శనం ఇస్తాడో చూడాలి. అన్ని రకాల పాత్రలు చేయగల బాలకృష్ణ పౌరాణిక పాత్రలలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: