ఆ సినిమాలో విలన్ పాత్ర చేస్తూ.. జగపతిబాబు రక్తం కక్కుకున్నాడట?
కానీ ఏకంగా పవర్ఫుల్ హీరో అయిన బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచాడు జగపతిబాబు. ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబులో ఈ యాంగిల్ కూడా దాగి ఉందా అని అనుకున్నారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా జగపతిబాబు కు తిరుగులేదు అని చెప్పాలి. వరుసగా అవకాశాలు అందుకుంటూ ఏ స్టార్ హీరో సినిమాలో చూసినా జగపతిబాబు విలన్ గా కనిపించారు. కేవలం రౌద్రంగా కనిపించే పాత్రల్లోనే కాదు ఎంతో సాఫ్ట్ గా కనిపించే పాత్రల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు జగపతిబాబు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలో విలన్ పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో పగ ప్రతీకారాల తో రగిలి పోయే బసి రెడ్డి పాత్రలో నటించాడు జగపతి బాబు. ఇక ఈ పాత్రలో జగపతిబాబు ఒదిగిపోయి నటించి ఆ పాత్రలకు ప్రాణం పోసాడు అనే చెప్పాలి. ఇక జగపతి బాబు నటన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ పాత్ర కోసం జగపతిబాబు ఎంత కష్టపడ్డాడుఅంటే.. ఈ పాత్రలో గొంతులో హీరో దింపిన కత్తి కి సంబంధించిన గాయం అలాగే ఉంటుంది. అయినప్పటికీ పవర్ ఫుల్ డైలాగ్స్ దగ్గుతు చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ పాత్ర కోసం డబ్బింగ్ చెబుతున్న సమయంలో దగ్గుతూ డైలాగ్స్ చెప్పడం వల్ల ఏకంగా కొన్నిసార్లు గొంతులో నుంచి రక్తం కూడా కక్కుకున్నాడట జగపతిబాబు. ఇక ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాడట. ఇక ఈ పాత్ర జగపతిబాబుకు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకునెలా చేసింది.