మీనా సినీ కెరీర్లో.. చేసిన అతి పెద్ద తప్పు ఇదేనట?

praveen
మీనా.. తెలుగు చిత్ర పరిశ్రమలో అందానికీ అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా  ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది.  ఇక చూడ చక్కనైన ముఖం.. ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఓ వైపు గ్లామర్ పాత్రలు మరోవైపు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది. ఒక దశాబ్దం పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా  స్థానాన్ని  కొనసాగించింది మీనా. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.



 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మీనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో వరుసగా విజయాలు అందుకుంది. కానీ ఇక మీనా తన కెరీర్లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేశాను అని ఎన్నోసార్లు బాధ పడ్డారట. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన రమ్యకృష్ణ కు దక్షిణాదిలో ఊహించినంత పేరు వచ్చింది.  అయితే ఈ సినిమాలో మొదట రమ్యకృష్ణ కు బదులుగా మీనా ను చిత్ర దర్శకుడు సంప్రదించారట.



 అయితే దర్శకుడు ఇక నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్రను మీనాకు వివరించగా ఆ పాత్ర కూడా మీనాకు తెగ నచ్చేసిందట. కానీ అప్పుడప్పుడే వరుస విజయాలను అందుకుంటున్న మీనా అంతలోనే నెగిటివ్ రోల్ చేస్తే ఆమెకు మార్కెట్ తగ్గిపోతుంది అని భావించి ఇక మీనా తల్లి  నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో తమ కూతురు నటించదు అంటూ దర్శకుడికి చెప్పేసిందట.  అయితే అటు రజనీకాంత్ కూడా మీనా తో నటించడానికి ఆసక్తి చూపినప్పటికీ మీనా మాత్రం నీలాంబరి పాత్ర మిస్ చేసుకుందట.  ఇక ఆ తర్వాత ఈ సినిమా హిట్ అవ్వడం పాత్ర బాగా హైలెట్ అవ్వడంతో.. ఇక ప్రతి ఫంక్షన్ లో కూడా నీలాంబరి  పాత్ర గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండడంతో ఎంతో బాధపడిందట మీనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: