ఇప్పుడైనా సంపత్ నంది కి పవన్ ఛాన్స్ ఇస్తాడా!!
అయితే దర్శకుడు సంపత్ నంది అందరు దర్శకుల లాగా కాకుండా ఆయన దర్శకత్వం వహిస్తున్న మూడవ సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాన్ని పొందారు. పవన్ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా సీక్వెల్ కోసం సంపత్ ను ఎంపిక చేయగా ఆయన ఎన్ని వెర్షన్లు తయారు చేసిన కూడా ఆ స్క్రిప్టుతో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. దాంతో ఆ సినిమా అవకాశం చేజారింది. ఇప్పుడు సంపత్ నంది మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సిటీ మార్ అనే సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ ఇతని పై నమ్మకం వస్తుందా అని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.
గోపీచంద్ హీరోగా సంపత్ నంది చేసిన సిటీ మార్ చిత్రం వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాగా అది భారీ రేంజ్ లో హిట్ అయ్యింది. కరోనా తర్వాత థియేటర్లో ఏ సినిమా కూడా రాణించలేక పోతోంది అన్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం థియేటర్లకు రప్పించి భారీ వసూళ్లను వసూలు చేసుకుంటుంది. మరి ఇది పవన్ చెప్పిన పడి ఆయనకు మరొక అవకాశం ఇస్తారో చూడాలి.