తండ్రి చనిపోయిన ఆ విషయం శ్రీదేవి కి తెలియలేదట...!

murali krishna
శ్రీదేవిఅతిలోక సుందరిగా మంచి పేరు పొందిన యాక్టర్. ఎన్నో అద్భుత సినిమాలు చేసిందని అందరికి తెలుసు.తెలుగు, తమిళం మరియు కన్నడ అలాగే హిందీ ఒకటేమిటీ అన్ని సినిమా పరిశ్రమలను ఓ ఊపు ఊపిందని తెలుస్తుంది.
పలు చిత్ర పరిశ్రమల్లో అగ్ర నటులు అందరితోనూ కలిసి నటించిందట శ్రీదేవి. హీరోయిన్ గా ఎవరూ అందుకోలేని స్థాయిని అందుకుందని సమాచారం. ప్రమాదవశాత్తు 2018లో దుబాయ్ లో మరణించింది శ్రీదేవి. లక్షలాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయింది. అయితే చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులంటే శ్రీదేవికి ఎంతో అభిమానం మరియు ప్రేమ అని తెలుస్తుంది.
శ్రీదేవి తన నాలుగో ఏటనే సినిమా రంగంలోకి అడుగు పెట్టిందని సమాచారం. బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుందట.ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి ఉత్తర మరియు దక్షిణం అని తేడా లేకుండా అగ్రతారగా ఎదిగిందని తెలుస్తుంది.. సినిమాలతో ఫుల్ బిజీ అయినా తన తల్లిదండ్రులను అనుక్షణం అంటిపెట్టుకొనే ఉన్నదట.  తల్లితండ్రులు రాజేశ్వరి, అయ్యప్పన్‌ తో ఆమెకు అనుబంధం చాలా ఎక్కువని తెలుస్తుంది. తల్లిదండ్రులు శ్రీదేవిని సిస్టమాటిక్ గా పెంచుతూనే ప్రేమను పంచేవారని సమాచారం.షూటింగ్ కు వెళ్లే సమయంలో తల్లిదండ్రులతో ఒక్కసారి అయినా మాట్లాడేదట శ్రీదేవి. లేదంటే తనకు ఏదీ తోచేది కాదని చెప్పిందని సమాచారం. వారిని వదిలి దూర ప్రాంతాలకు షూటింగ్ కు వెళ్లినప్పుడు కూడా తప్పకుండా రోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసేదని సమాచారం.
ప్రతి రోజు తల్లిదండ్రుల నుంచి ఫోన్లు వచ్చేవని తెలుస్తుంది. కానీ ఓ రోజు తనకు కాల్ రాలేదని సమాచారం. మరుసటి రోజు తన తల్లి ఫోన్ చేసిందని తెలుస్తుంది.. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పిందట. కానీ అంతకు ముందు రోజే తన తండ్రి చనిపోయాడట. ఆ విషయం తనకు తెలియనివ్వలేదనీ సమాచారం.ఈ ఘటన నుంచి బయట పడేందుకు శ్రీదేవికి చాలా కాలం పట్టిందనీ తెలుస్తుంది.తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకునే సమయంలోనే తల్లికూడా చనిపోయిందనీ సమాచారం. తన తల్లికి దగ్గరుండి అంత్యక్రియలు చేసిందట  శ్రీదేవి. తన జీవితంలో అత్యంత బాధాకర సంఘటనలు తన తల్లిదండ్రుల మరణం అనీ చెప్పిందట శ్రీదేవి. నిజానికి తను కూడా అలాగే సడెన్ గానే చనిపోయి కోట్లాది అభిమానులకు షాక్ కు గురి చేసిందనీ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: