ప్రభాస్ తో గొడవపడ్డ స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

Anilkumar
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో పాన్ ఇండియా ఇమేజ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ఇక ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా అతనితో కలసి ఒక్క సినిమాలో నటిస్తే ఆ హీరోయిన్ కి కూడా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుతో పాటూ ఆఫర్లు కూడా పెరుగుతాయి.ఇక ప్రభాస్ తో నటించే ఛాన్స్ వస్తే నో అని చెప్పే హీరోయిన్స్ దాదాపుగా ఇండ్రస్టీ లో లేరనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో నటించిన హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా ఒకరు.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'ఎక్ నిరంజన్' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.


ఈ సినిమాలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమాలో నటించేటప్పటికీ కంగనాకు ఇంకా స్టార్ స్టేటస్ రాలేదు.అయితే ప్రస్తుతం మాత్రం బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తో తన కెరీర్ ను కొనసాగిస్తోంది కంగనా.అయితే తాజాగా ఈ హీరోయిన్ ఎక్ నిరంజన్ షూటింగ్ సమయంలో ప్రభాస్ తో తనకు గొడవ జరిగిందని..తాను,ప్రభాస్ కొన్ని రోజుల వరకు మాట్లాడుకోలేదని చెప్పుకొచ్చింది.ఇక ప్రభాస్ సెట్ లో చాలా కూల్ గా ఉంటారని ఆయనతో పని చేసిన వాళ్ళు చెప్తుంటారు.కాని కంగనా రనౌత్ మాత్రం ప్రభాస్ సెట్ లో గొడవ కూడా పడతాడాని ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ని రివీల్ చేశారు.ఇక మరోవైపు ప్రభాస్ తో ఇప్పుడు మరో సినిమాలో నటించాలని భావిస్తోంది కంగనా.


ఒకవైపు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సౌత్ సినిమాలపై దృష్టి పెడుతోంది కంగనా.ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో ఓ తెలుగు సినిమాలో నటించాలని భావిస్తుండగా..ప్రభాస్ సినిమా డైరెక్టర్స్ లో ఎవరైనా ఈ హీరోయిన్ కి అవకాశం ఇస్తారేమో చూడాలి.ఇక తాజాగా కంగనా రనౌత్ నటించిన 'తలైవి' చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రముఖ నటి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా.. ఇందులో జయలలిత పాత్రలో కంగనా నటించింది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ప్రభాస్ తో తనకు ఎక్ నిరంజన్ షూటింగ్ సమయంలో జరిగిన గొడవ గురించి చెప్పుకొచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: