యాంకర్ అనసూయకు చెవుడు.. ఆటాడుకున్న ఆది?

praveen
హైపర్ ఆది.. ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కమెడియన్ తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పంచి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో ఏకంగా టీం లీడర్ గా మారిపోయిన హైపర్ ఆది ఇక ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం లో టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం చాలామంది ప్రేక్షకులు హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఒక్కసారి హైపర్ ఆది స్కిట్ స్టార్ట్ అయింది అంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా పగలబడి నవ్వు కోవాల్సిందే.

 ఆ రేంజ్ లో ఏకంగా అదిరిపోయే  పంచ్ లతో నిండి ఉంటుంది హైపర్ ఆది స్కిట్.  ఇక ఎప్పుడూ తనదైన శైలిలో కామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు ఆది. అయితే అటు జబర్దస్త్ యాంకర్ గా ఉన్న అనసూయపై కూడా స్కిట్ లో భాగంగా అప్పుడప్పుడు హైపర్ ఆది పంచులు వేస్తూ ఉండడం గమనార్హం. కొన్ని కొన్ని సార్లు హైపర్ ఆది వేసే పంచ్ లు అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ ప్రోమో లో భాగంగా అటు సరికొత్త కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చాడు హైపర్ ఆది.

 ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లు, యాంకర్, జడ్జీలు ముసలి వాళ్లు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనే కాన్సెప్టుతో తెర మీదికి వచ్చాడు. ఈ క్రమంలోనే అనసూయకు చెవుడు వస్తుంది.. ఇక రామ్ ప్రసాద్, హైపర్ ఆది మాట్లాడుకుంటూ అనసూయకు చెవుడు రావడం వల్ల 90000 ఇస్తాను అంటే యాభై వేల కంటే తగ్గేది లేదు అంటూ చెబుతోంది అని మాట్లాడుకుంటారు. ఇక వెంటనే హైపర్ ఆది అనసూయ దగ్గరికి వెళ్లి.. ఈవెంట్ కి 90000 ఇస్తానన్నారు.. 50,000 కాదు అంటూ గట్టిగా చెబుతాడు..  మీరు ఎన్ని చెప్పినా సరే 45 వేల కంటే తక్కువ చేయను అంటూ అనసూయ పాత్రలో ఉన్న రైజింగ్ రాజు చెబుతాడు. దీంతో అందరూ పగలబడి నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: