అదరగొడుతున్న రజినీ ఆన్నాత్తే మోషన్ పోస్టర్!!

P.Nishanth Kumar
రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అన్నాత్తే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా రెడీ అవుతుండగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.  అయితే ముందు గా చెప్పినట్లుగానే ఈరోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసింది యూనిట్. ప్రేక్షకులు ఎప్పటినుంచో రజినీకాంత్ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తుండగా ఈరోజు రెండు అప్డేట్ లను విడుదల చేసి చిత్ర బృందం వారి అభిమానులను ఎంతో ఖుషీ చేసింది.

నవంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథాంశంతో తెరకెక్కుతు ఉండగా రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ఇతర పాత్రలలో నటించనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటుంది చిత్రం. కాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లో ప్రేక్షకులను ఎంతగానో నొప్పించక సాయంత్రం విడుదలైన మోసం పోస్టర్ కూడా అంతకు మించి అలరించింది. 

ప్రేక్షకులను ఎంతగానో మెప్పించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయనను ఈ లుక్ లో చూసి చాలా రోజులు అవుతుంది అని కూడా కామెంట్లు పెట్టారు. ఏదేమైనా రజినీకాంత్ వయస్సు పెరిగినా ఆయన సినిమాలకు మాత్రం ఏ విధంగా క్రేజ్ తగ్గలేదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇక రజినీకాంత్ వరస సినిమా లతో దూసుకు పోతూ ఉండగా ప్రస్తుతం శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. వీటిలో కార్తీక్ సుబ్బరాజు సినిమా ఒకటి. మరి ఈ అన్నాత్తే సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: