సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట
సినిమా దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తుండగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది టీజర్.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మహేష్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా వారి అంచనాలకు తగ్గట్లు ఈ
సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కుతున్న ట్లు చిత్ర బృందం తెలుపుతుంది.
తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలోని పాటలు అంతే అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ
సినిమా తరువాత మహేష్ బాబు
రాజమౌళి త్రివిక్రమ్ లతో రెండు సినిమాలను చేయాల్సి ఉండగా ముందుగా
త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని మహేష్ భావించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే రాజమౌళితో
సినిమా చేయాలని చూశాడు. అయితే ఇప్పుడు ప్లాన్ మారినట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు ముందుగా
రాజమౌళి సినిమానే సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని చూస్తున్నాడట.
ఆర్ ఆర్ ఆర్
సినిమా పూర్తయిన నేపథ్యంలో
రాజమౌళి మహేష్ తో
సినిమా చేద్దాం అని చెప్పగా
త్రివిక్రమ్ సినిమాని కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టి
రాజమౌళి తో
సినిమా చేయాలని మహేష్ భావించాడు. ఆ విధంగా
త్రివిక్రమ్ సినిమా కొన్ని నెలలు పోస్ట్‌పోన్ అవక తప్పడం లేదు. ఇప్పటికే
ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ చేసుకుని అవమాన భారంతో ఉన్న
త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు
సినిమా కూడా చేతిలోంచి పోయేలా ఉంది. ఈ నేపథ్యంలో
త్రివిక్రమ్ ఇప్పడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమాలో ప్రేక్షకులను విపరీతంగా అనిపించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.
రాజమౌళి త్రివిక్రమ్ రెండు సినిమాలను ఒకేసారి మొదలు పెడితే బాగుంటుందని కొంత మంది ప్రేక్షకులు మహేష్ కు సలహా ఇస్తున్నారు. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి