పవన్ మూవీ టైటిల్ చుట్టూ వివాదాలు?

Seetha Sailaja

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఈ సినిమా  ప్రారంభం కాకుండానే ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించకుండానే వివాదాలలోకి  వెలుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికికారణం ఈ మూవీ టైటిల్ గురించి జరుగుతున్న ఊహా గానాలు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి ‘భవదీయుడు భగత్ సింగ్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.


‘గబ్బర్ సింగ్’ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లోనిర్మాణం జరుపుకోబోతున్న మూవీ కావడంతో ఈమూవీ ప్రారంభం కాకుండానే ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈమూవీకి ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేసారు అని వస్తున్న్ గాసిప్పులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ‘భగత్ సింగ్’ అనే పేరు వినగానే భారత జాతి గర్వంగా అలనాటి ఆయన త్యాగాలను గుర్తుకు చేసుకుంటుంది.


అలాంటి మహోన్నత వ్యక్తి పేరు టైటిల్ తో సినిమా తీయడం ఒక సాహసం అయితే ఆ టైటిల్ ముందు ‘భవధీయుడు’ అన్న అక్షరాల కూర్పు ఎంతవరకు భగత్ సింగ్ అభిమానులు అంగీకరిస్తారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాలు హరీష్ శంకర్ దృష్టి వరకు కూడ రావడంతో ఈసినిమా టైటిల్ లో భవదీయుడు అన్నది ముందు పెట్టి ఆతరువాత ‘భగత్ సింగ్’ లేదా మరొక పేరు పెట్టాలని హరీష్ శంకర్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


వాస్తవానికి ఈమూవీ స్క్రిప్ట్ అంతా సామాజిక సమస్యలు చుట్టూ తిరుగుతూ పవన్ భావజాలానికి బాగా దగ్గరగా ఉంటుంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇలా పవర్ ఫుల్ టైటిల్ ఎంచుకుంటే ఆ టైటిల్ కు తగ్గట్టుగా కథ లేకుంటే కేవలం టైటిల్ ఇమేజ్ మాత్రమే మిగిలి సినిమా నిరాశ పరిచే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో వివాదాలు ఎదురైనప్పటికి ఆ విషయాలను పక్కకు పెట్టి హరీష్ శంకర్ ఈ టైటిల్ ఫిక్స్ చేసే విషయంలో ముందడుగు వేస్తాడో లేదో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: